ఆసుపత్రిలో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |
ఆసుపత్రిలో చేరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా(X) ఖాతా ద్వారా తెలియజేశారు. ‘‘రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

మరోవైపు.. పవన్ కల్యా్ణ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి జనసేన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ టెస్టుల కోసమే ఆసుపత్రికి వచ్చారని పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Next Story

Most Viewed