వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఇదే..?

by Mahesh |   ( Updated:2024-09-04 14:58:17.0  )
వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఇదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఎర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విజయవాడలో కురిసిన కుంభవృష్టి కారణంగా నగరంలోని సగభాగం వరదల్లో చిక్కుకుంది. దీనికి తోడు బుడమేరు వాగు పొంగిపోర్లడంతో మరిన్ని కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో గత నాలుగు రోజులుగా ప్రజలు వరదల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం మూడు సార్లు, మంత్రులు నిత్యం వరద(floods) ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో ఎక్కడ చిన్న సమస్య వచ్చిన వెంటనే అక్కడకు వెళ్లిన పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ప్రశ్నలపై ఆయన స్పందించారు.

ప్రకృతి వైపరీత్యం(Natural disaster) వల్ల జరిగిన ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉండాలనే తాను చూస్తానని.. కానీ తాను పర్యటనకు వెళితే.. తన అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని.. ఈ క్రమంలో బాధితులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని.. అలాగే నేను రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ఆలోచించే ముందస్తుగానే తాను వరద ప్రాంతాలకు వెళ్లలేదని.. అన్నారు. " నా పర్యటన ప్రజలకు సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే తాను రాలేదని కొందరు నిందలు వేస్తారు తప్ప.. వారు చేసేది ఎమ్ లేదని పవన్ వైసీపీ(YCP) నేతలను ఉద్దేశించి అన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ. 1 కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed