స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రత లేదు: సీపీఐ నారాయణ

by GSrikanth |
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రత లేదు: సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏపీలోని పల్నాడు జిల్లాలో హింసాత్మక దాడులు, ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సిట్ దర్యాప్తుపై సీపీఐ పార్టీ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వేసిన సిట్ వేస్ట్ అని కొట్టిపారేశారు. సిట్ వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. ఏపీలో అరాచకాలు జరుగుతుంటే జగన్‌, చంద్రబాబు విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నాయకుడి లక్షణం ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో అల్లర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. పోలింగ్ అనంతర అల్లర్లపై జ్యూడీషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏపీలో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత లేదని.. కనీసం అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు అని అన్నారు.



Next Story