ఏపీ ఫలితాలపై సీపీఐ నేత రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-05-18 09:35:40.0  )
CPI Ramakrishna
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతాయన్నారు. ఇండియా కూటమివైపు ప్రజలు విశ్వంగా ఉన్నారని తెలిపారు. ఏపీలో టీడీపీ అధికారం వస్తే అది బీజేపీ వల్ల కాదని.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనేనని చెప్పారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఓటుతోనే టీడీపీకి అధికారం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు సమగ్రంగా జరగాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Read More..

ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఫలితాలలో అబ్బాయిలదే హవా!.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం

Advertisement

Next Story