Mlc Election: భారీ మెజార్టీలో ఆలపాటి రాజా

by srinivas |   ( Updated:2025-03-03 12:39:44.0  )
Mlc Election: భారీ మెజార్టీలో ఆలపాటి రాజా
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)-కృష్ణా(Krishna) జిల్లాల పట్టభద్రుల(Graduates) MLC ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే తొలి రౌండ్‌లో 9,980 ఓట్ల మెజార్టీలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా(TDP candidate Alapati Raja) ఉన్నారు. ఇప్పటి వరకూ ఆలపాటి రాజాకు 17,194 ఓట్లు రాగా.. కేఎస్ లక్ష్మణ్‌కు 7,214 ఓట్లు వచ్చాయి. అయితే 3070 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు.

కాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ సభ్యుడి స్థానానికి ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరిగింది. మొత్తం 67. 57 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం 2,04,502 మంది పట్టభద్రులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు పోటీ చేశారు. వీరితో పాటు మరో 23 మంది బరిలోకి దిగారు. అయితే ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ఉదయం నుంచే కొనసాగుతోంది. ప్రస్తుతం లీడ్‌లో ఆలపాటి రాజా కొనసాగుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగిస్తే ఆలపాటి విజయం సాధించే అవకాశం ఉందని టీడీపీ నేతలు అటున్నారు. చూడాలి మరి.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed