- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Latest AP Political News: వైసీపీ పై కాంగ్రెస్ ప్రత్యక్ష దాడి..
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రానున్న ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా ప్రతి పార్టీ అడుగులేస్తోంది. ఇక తెలంగాణాలో గెలుపొందిన కాంగ్రెస్ అదే జోరును ఆంధ్రప్రదేశ్ లోనూ చూపిస్తోంది. అయితే రాష్ట్రాన్ని ముక్కలు చేసి తమకు అన్యాయం చేశారు అనే భావన ఏపీ ప్రజల్లో నేటికీ ఉంది. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి అభ్యర్థులే దొరకలేదు. ఒకరో ఇద్దరో పోటీ చేసిన డిపాజిట్ కూడ దక్కలేదు. అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా అడుగెలుస్తున్న కాంగ్రెస్ అధికార పార్టీ అధినేత వైస్ రాజశేఖర్ బిడ్డని ఓడించడానికి అయన మరో బిడ్డనే అస్త్రంగా ప్రయోగిస్తోంది కాంగ్రెస్.
అన్న పై పోటీకి చెల్లి సై అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకుంది వైస్ షర్మిల. దీనితో అన్న వదిలిన రాజకీయ బాణం అన్నవైపే దూసుకురావడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక వైస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పగ్గాలను ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీ కి వెళ్లిన వైస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను సొంతగూటి తీసుకు రావాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇక వైస్ షర్మిల అధ్యక్షతన ఏపీ ప్రజల మన్ననలు కూడా దొరుకుతాయని ఆశపడుతోంది కాంగ్రెస్.