Pithapuram: తాటిపర్తిలో జనసేన, టీడీపీ మధ్య ఘర్షణ

by srinivas |
Pithapuram: తాటిపర్తిలో జనసేన, టీడీపీ మధ్య ఘర్షణ
X

దిశ, పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తాడిపర్తిలో జనసేన, టిడిపి వర్గాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాటిపర్తిలో వెలసినటు వంటి అపర్ణ దేవి అమ్మవారి గుడి బాధ్యతల కొసం జనసేన టిడిపి పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగాయి.గుడి నిర్వహణ కమిటీ బాధ్యతలు కావాలంటూ జనసేన పార్టీ డిమాండ్ చేయటంతో, నిర్వహణ కమిటీ టిడిపికే కావాలంటూ కార్యకర్తలు పట్టుపట్టారు.ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పెద్దలు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా వ్యవహారించారు.

ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పొత్తు ధర్మం పాటించి ఎస్వీఎస్ వర్మ నాయకత్వంలో జనసేనాని విజయానికి కృషి చేసామన్నారు.జనసేనలో ఇటీవల చేరిన వైకాపా కార్యకర్తలకు ప్రస్తుత కమిటీ సభ్యులు గుడి తాళాలు,అలయ నిర్వహణకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం ద్వారా ఈ ఘర్షణలు తలెత్తాయన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అనధికారికంగా వైసీపీ నాయకులు జనసేన, టిడిపి మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించటంపై తాము అందోళనకు దిగాల్సివచ్చిందన్నారు

Advertisement

Next Story

Most Viewed