- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Konaseema: రామచంద్రాపురం టికెట్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి వేణు
దిశ, వెబ్ డెస్క్: కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. అంతేకాదు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. పోటీ చేసే అంశంపై ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బహిరంగంగానే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేదానిపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వేణుకు సీటు ఇస్తే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని బోస్ అంటున్నారు. అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే తనకు గౌరవం ఉందని మంత్రి వేణు అన్నారు. టికెట్ల విషయంలో పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వేణు స్పష్టం చేశారు.
ఇక వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పవన్ కు ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ ఆడుతున్నారని ఆరోపించారు. పొలిటికల్ గెయిన్ కోసమే చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత చెప్పారు. పవన్ కల్యాణ్ వాలంటీర్ల మనోభావాలను కించపర్చేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం వెనకాడదని స్పష్టం చేశారు. ప్రజలను పక్కదారి పట్టించడమే పవన్ అజెండా అని మంత్రి వేణు ఎద్దేవా చేశారు.