- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని జగనన్న కాలనీలను సీఎం జగన్ పరిశీలించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ గురువారం ఆవిష్కరించారు. అనంతరం పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లను సీఎం జగన్ అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరుతో ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉందని వైసీపీ చెప్తోంది. ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు అని వైసీపీ స్పష్టం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది అని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా తెలిపారు.
అందుబాటులోకి 7.43 లక్షల ఇళ్లు
పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తైనట్లు సీఎం జగన్ తెలిపారు. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడించారు. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ తెలిపారు.