- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. ముహూర్తం ఖరారు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడు ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది. తాజాగా.. ఆయనతో ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ నెల 15న విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది.
Advertisement
Next Story