‘చీకటి దందా మొత్తం వెలుగులోకి తెస్తాం’.. సీఎం రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్

by Satheesh |
‘చీకటి దందా మొత్తం వెలుగులోకి తెస్తాం’.. సీఎం రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేతలకు ఎంపీ సీఎం రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతల చీకటి దందా మొత్తాన్ని వెలుగులోకి తెస్తామని హెచ్చరించారు. విశాఖలో రౌడీయిజం, గుండాయిజం చేసిన వైసీపీ నేతలను వదిలేపెట్టే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్లలో దోచుకున్న పేదలు, ప్రభుత్వ ఆస్తులను తిరిగి రాబడుతామని అన్నారు. అవినీతి చేసిన వారిపై చట్టపరంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక, తను విశాఖ నుండి పోటీ చేయాలనుకుంటే అనకాపల్లి నుండి అవకాశం వచ్చిందని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని తెలిపారు. కాగా, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read More..

BREAKING: తెలంగాణలో మరో సంచలన ఘటన..కుక్కల దాడిలో 42 రోజుల బాలుడు మృతి

Next Story