- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Political News: రాక్షస పాలన పోవాలి రాముని పాలన రావాలి.. బీజేపీ ప్రముఖ నేత
దిశ తిరుమల: శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకులు సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయమై అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని బీజేపీని కోరడం జరిగిందని పేర్కొన్నారు.
అలానే పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని అది పోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాక్షస పాలనను గద్దె దింపాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు సెంటిమెంటుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగుదేశం, బిజెపి, జనసేన , పార్టీల పొత్తు చాలా బాగుందని, చాలా బాగా సక్సెస్ అయిందని, రానున్న ఎన్నికలలో కూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు