అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ సామాజిక సాధికారత

by Mahesh |
అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ సామాజిక సాధికారత
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ.. ఈ సారి 175 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించాలనే తపనతో ఉంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఏంపీలను, మంత్రులను మార్చి వారి స్థానాల్లో కీలకమైన వ్యక్తులు, ప్రజల నమ్మకం కలిగిన అభ్యర్థులను నియోజకవర్గాల అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎన్నికలో సీఎం జగన్ సామాజిక సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగినట్లు తెలుస్తోంది.

  • 200 సీట్లలో 50% బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ వర్గాలకు కేటాయించారు.
  • 200 సీట్లలో 24 మంది మహిళా అభ్యర్థులు, 7 మంది మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు.
  • 200 సీట్లలో, గణనీయంగా 77% గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు మొత్తం 153 మంది ఉన్నారు. వారిలో 17 మంది వైద్యులు, 15 మంది న్యాయవాదులు, 34 ఇంజనీర్లు, 5 మంది ఉపాధ్యాయులు, 2 రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, 1 రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది, 1 జర్నలిస్టు ఉన్నారు.
  • వైయ‌స్ఆర్‌సీపీ కోసం అంకితభావంతో నిరంతరం కృషి చేస్తున్న పార్టీ సభ్యులు, పార్టీ కేడర్ గా ఉన్న మేయర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కార్పొరేటర్, పార్టీ కార్యకర్త వంటి స్థానిక సంస్థల నుంచి లేదా కిందిస్థాయి కేడర్ నుంచి ఎదిగిన నేతలకు 14 సీట్లు కేటాయించారు.
  • వైసీపీ అభ్యర్ధులను 2019తో పోల్చితే వారిలో బీసీ అభ్యర్థులు 11 స్థానాలు (48 నుంచి 59), మైనారిటీ అభ్యర్థులు 2 సీట్లు (5 నుంచి 7), మహిళా అభ్యర్థులు 5 స్థానాలు (19 నుంచి 24)ఈసారి పెరిగారు.
  • 200 మంది అభ్యర్ధులలో దాదాపు 25% అంటే 50 మంది అభ్యర్థులు తొలిసారిగా పోటీ చేస్తునవారు ఉన్నారు.

మొత్తం అసెంబ్లీ అభ్యర్ధులు

బీసీ 48

ఎస్సీ 29

ఎస్టీ 7

ఓసీ 91

మొత్తం = 175

పార్లమెంట్ అభ్యర్ధులు

బీసీ 11

ఎస్సీ 4

ఎస్టీ 1

ఓసీ 9

మొత్తం 25

Advertisement

Next Story

Most Viewed