- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగన్ సిద్ధం సభ తుస్సు..! రూ. 200 కోట్లు బొక్క అంటూ టీడీపీ ఘాటు విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో ఇవాళ రాప్తాడు ‘సిద్ధం’ సభ జరిగిందని, సభకు లక్షలాదిగా తరలి వచ్చారని వైసీపీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఈ రాప్తాడు సిద్ధం సభపై తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదికగా ఇవాళ తీవ్ర విమర్శలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘సాక్షిలో గ్రాఫిక్స్ , గ్రౌండ్ లో తుస్సు.. పది లక్షలు అన్నాడు, పది వేల మంది కూడా లేరు కదా.. పెద్దిరెడ్డికి రూ.200 కోట్లు బొక్క’ అంటూ టీడీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలోనే వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఖాళీ కూర్చిలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు స్పందించాయి.
మీటింగుకు 4-5 గంటల ముందు వీడియో తీసి జనాలు రాలేదని చూపిస్తే నమ్మేస్తారు అనుకున్నారా అని టీడీపీకి శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. అయితే ఈ రాప్తాడు సభలో సీఎం జగన్ టీడీపీ, జనసేన పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బయట ఉండాలని, గ్లాస్ సింకులో ఉండాలని ఆయన ఆ పార్టీలను తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కుర్చీలు మడిచి 23 సీట్లకు తగ్గించారని.. మరోసారి చొక్కా మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.