- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
దిశ, డైనమిక్ బ్యూరో : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌లతో సీఎం జగన్ మాట్లాడారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇకపోతే ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డులోని రివ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 నుంచి60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.