- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనూహ్యంగా ఇవాళ్టి పర్యటన వాయిదా.. రేపు ఢిల్లీకి YS Jagan Mohan Reddy

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఢిల్లీ బయల్దేరారు. కానీ ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనతో సీఎం జగన్ మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా ఢిల్లీలో మంగళవారం ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అలాగే ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగే దౌత్యవేత్తల సమావేశానికి సంబంధించిన కార్యక్రమంలోనూ ఆయన ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.
Next Story