- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే: సీఎం జగన్ సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, సీఎం జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు. తనకు అబద్ధాలు, మోసం చేయడం రాదని.. చంద్రబాబు, ప్రతిపక్ష కూటమి ఆడే అబద్ధాలతో పోటీ పడలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు అబద్దాలకు రెక్కలు కట్టేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ మాట ఇచ్చాడంటే కచ్చితంగా ఆ పని చేసి చూపిస్తాడని.. పేద ప్రజలకు మంచి చేయడంలో తనతో పోటీ పడే నేత దేశంలోనే లేడని ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు. రూ.3 వేలు ఆసరా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదని నొక్కిచెప్పారు. నెలకు రూ.2 వేల కోట్లు పెన్షన్లకే కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి అందర్నీ మోసం చేయడానికి చంద్రబాబు దొంగ హామీలు ఇస్తున్నారని అన్నారు. కూటమి ఇచ్చిన హామీలకు రూ.లక్షా 40 వేల కోట్లు కావాల్సి ఉంటుందని.. సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఓటేస్తే పులి నోట్లో తలపెట్టినట్లేనని సెటైర్ వేశారు.
Read More..
సీఎం జగన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు