- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan: రేపు నామినేషన్ వేయనున్న సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసు శాఖ
CM Jagan: రేపు నామినేషన్ వేయనున్న సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసు శాఖ
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్ రేపు పులివెందులలో తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. అయితే, ఇప్పటికే జగన్ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సీఎం నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యం ఎలాంటి అవాంఛనీయ దాడులు చోటుచేసుకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనుంది. నామినేషన్ ర్యాలీలో వేల మంది పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు మఫ్టీలో నిరంతరం నిఘా వేయనున్నారు.
Next Story