- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో గిరిజనుల స్థితిగతులు, వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల జీవన ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. గిరిజన మహిళల సౌకర్యానికి గర్భినీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను క్రియాశీలం చేయాలని, ఫీడర్ అంబులెన్సులు తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, గిరిజన హస్టళ్లలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉన్నతాధికారులు హజరయ్యారు. మరోవైపు గంజాయి కట్టడి అంశంపై సీఎం చర్చిస్తున్నారు.