CM Chandrababu:స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం

by Jakkula Mamatha |
CM Chandrababu:స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరో సరికొత్త విజన్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేడు(శుక్రవారం) విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌ను(Swarnandhra@2047 Vision Document) సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. విజన్ డాక్యుమెంట్(Vision Document) రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. విజన్‌లో పొందు పరిచిన పది సూత్రాలను రిమోట్ ద్వారా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) డాక్యుమెంట్ పై సంతకం చేశారు. అనంతరం మంత్రి లోకేష్(Minister Lokesh) సంతకం పెట్టారు. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, అనిత తదితరులు సంతకాలు చేశారు. మంత్రలు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.

Advertisement

Next Story