జగన్‌కు బిగ్ ట్విస్ట్.. కీలక లిస్ట్ విడుదల చేసిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-10-18 13:03:59.0  )
జగన్‌కు బిగ్ ట్విస్ట్.. కీలక లిస్ట్ విడుదల చేసిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పునర్ వ్యవవస్థీకరణ(AP reorganization) జరిగిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం(TDP Govt) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చాలా హామీలు ఇచ్చారు. అందులో చాలా వరకూ హామీలు నెరవేర్చారు. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు పాలన సాగించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పాదయాత్ర చేయడంతో 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పీఠాన్ని వైఎస్ జగన్ దక్కించుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించారు. టీడీపీ అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్‌లో ఎన్నికల మేనిఫెస్టోను తీయడంపై విమర్శలు కురిపించారు. ఆరువందల హామీలు ఇచ్చి చంద్రబాబు మాట తప్పారని పదే పదే గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు.

అయితే ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చే సమయం ఇప్పుడు రావడంతో మాజీ సీఎం జగన్‌కు సీఎం చంద్రబాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 2024 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామంటూ శుక్రవారం మధ్యాహ్నం లిస్ట్ విడుదల చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్యనేతలతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచే ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించామని, ఇప్పటికే చాలా వరకూ పూర్తి చేశామని, త్వరలో మరికొన్నింటిని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. విమర్శించే వాళ్లకు ఈ లిస్టు చూపాలని సూచించారు.

చంద్రబాబు నేరవేర్చిన హామీలు

* ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం.

* మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం.

* స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం

* గీత కులాలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చాం

* అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు

* నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు

* ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంచాం

చంద్రబాబు నెరవేర్చబోతున్న హామీలు

* వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు కూడా అందిస్తాం

* చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం...కేంద్రం ఇవ్వకపోతే రీయింబర్స్ చేస్తాం.

* చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం.

* పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్ లైన్ లో పెట్టాం.

* రాజధాని ఒక్కటే ఉంటుంది...అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది.

* కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.

* ఓర్వకల్లు, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తాం.

* రైతులకు డ్రిప్ లు అందిస్తున్నాం.

* పాడి రైతులకు 90 శాతం సబ్సిడీతో షెడ్లు నిర్మిస్తున్నాం.

* విశాఖ రైల్వే జోన్ క్లియర్ అయ్యింది

* రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించాం.

* శాంతిభద్రతల విషయంలోనూ రాజీ పడకుండా నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాం.

* బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తున్నాం.

* ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతో పాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అందిస్తాం.

* దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం.

Advertisement

Next Story

Most Viewed