- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ap: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లుపై చర్చించామని కేంద్రమంత్రులతో భేటీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో భూముల కంప్యూటరీకరణలో చాలా సమస్యలు వచ్చాయని చెప్పారు. గతంలో నాయకులు, అధికారులు కలిపోయారని తెలిపారు. ఇందువల్ల ప్రైవేటు భూములను బలవంతంగా 22Eలో చేర్చారని చెప్పారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారన్నారు. సందప సృష్టించలేని వారికి సంక్షేమం పేరుతో పంపకం చేసే హక్కులేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నదుల అనుసంధానంతో పోలవరం-బనకచర్ల లింక్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు తెలిపారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని నీటి ఎద్దడిని తీరుస్తామన్నారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సమస్య ఎక్కువగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి మాట వినిపించకుండా చేస్తామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో విజయం సాధించామని, ప్రజలు తమ వైపు ఉన్నారడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు పేర్కొన్నారు.