ఏపీ పోలీస్ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. త్వరలో ప్రక్షాళన

by srinivas |   ( Updated:2024-06-21 13:44:42.0  )
ఏపీ పోలీస్ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. త్వరలో ప్రక్షాళన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పోలీస్ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రక్షాళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వహయాంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో వారంతా జైళ్లకు సైతం వెళ్లి బెయిల్‌పై విడుదల అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా పోలీస్ యంత్రాంగంలోనూ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించారు. ఇంకా జగన్‌ అనుకూల అధికారులు ఉన్నారని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగంలోనూ త్వరలో ప్రక్షాళన చేపడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో జరిగిన బాలిక హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దోషులను గుర్తించి కఠిన శిక్షలు అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు రక్షణ కల్పించడమే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ఈపురుపాలెం ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. బాలిక హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబుతో భేటీ డీజీపీ తిరుమలరావు వివరించారు. ఈ సందర్భంగా బాలిక హత్యపై సీఎం చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed