భోగాపురం ఎయిర్‌పోర్టు పనులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by srinivas |
భోగాపురం ఎయిర్‌పోర్టు పనులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ, ఏపీ బ్యూరో అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. విహంగ వీక్షణం ద్వారా ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్టు చాలా కీలకమన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయన్నారు. భోగాపురం వరకు బీచ్ రోడ్డు కూడా నిర్మాణం జరగాలని, పారిశ్రామికంగా ఎదిగేందుకు ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.


‘‘నేను 2014లో సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్నీ మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు 31.8 శాతం పని పూర్తి అయింది. రూ.400 కోట్లతో ఫేజ్-1 ప్రారంభం అవుతుంది. ఎయిర్ పోర్టు వస్తే చుట్టుపక్కల అంతా అభివృద్ధి జరుగుతుంది. 2026 నాటికి విమానాశ్రయం ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం. విమానాశ్రయం ప్రారంభంలోనే 4.8 మిలియన్ల ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి. భవిష్యత్తులో భోగాపురం ప్రాంతం ఎకనామిక్ హబ్‌గా మారనుంది. ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర ప్రజలు అద్భుతంగా మద్దతు ఇచ్చారు. అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంది. భోగాపురం విమనాశ్రయం వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై ఉంది.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.



Next Story