- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu: రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే సహించం: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ ముసుగులో ఎవరైనా నేరాలు చేస్తే సహించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Nayudu) మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ కృష్ణ జల్లా (Krishna District) మచిలీపట్నం (Machilipatnam)లో నిర్వహించిన ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక నుంచి రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారి తోక కట్ చేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యంగా రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను అసలు వదిలే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఎవరైనా నేరం చేస్తే నిమిషాల్లో పట్టుకునే వ్యవస్థ తమ ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. నేరస్తుల ఆట కట్టించేందుకు అత్యాధునిక టెక్నాజీని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్రిస్టల్ క్లియర్ కెమెరాలను అమర్చుతున్నామని.. ఇక నేరం చేసిన వారిని పక్కా ఆధారాలతో పట్టుకుంటామని, తప్పించుకునే ఛాన్స్ లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ అన్నారు.