అదే చివరి రోజు.. రౌడీలకు, సైకోలపై చంద్రబాబు వార్నింగ్

by srinivas |
అదే చివరి రోజు.. రౌడీలకు, సైకోలపై చంద్రబాబు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రౌడీలకు, సైకోలపై సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సీరియస్ అయ్యారు. పోలీసు సంస్మరణ దినం(Police Memorial Day) సందర్భంగా విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రౌడీలకు, సైకోలకు చంద్రబాబు సవాల్ విసిరారు. నేరాలు చేస్తే వదిలేది లేదన్నారు. నేరాలు చేస్తే రౌడీలకు అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వ వారసత్వంగా గంజాయి వచ్చాయని, డ్రగ్స్ పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, చిన్న పిల్లలని కూడా వదిలిపెట్టటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కేసును ఒక సవాలుగా తీసుకుని, వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. చట్ట ప్రకారమే శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ప్రత్యేక కోర్టులు పెట్టి, వెంటనే శిక్షలు పడేలా చేస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed