వరద బాధితులకు భరోసా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-06 14:38:38.0  )
వరద బాధితులకు భరోసా.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. శుక్రవారం బాధితులతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నాం. ఆరు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాం. నిన్న మళ్లీ వర్షాలతో కొంత ఇబ్బంది జరిగింది. యుద్ధ ప్రాతిపదికన వరదబాధితులను ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు డిజిటల్ ఎంపవర్‌మెంట్ తీసుకొస్తామని అన్నారు.

ప్రతి వార్డులో ఔత్సాహికులకు నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాలను 32 డివిజన్లుగా విభజించామని అన్నారు. ఆహారం, నీళ్లు, బిస్కెట్లు, క్యాండిల్స్ అందిస్తున్నాం. డ్రైఫుడ్‌లో నూడిల్స్, యాపిల్స్, బిస్కట్స్, వాటర్ బాటిల్స్, పాలు ఇస్తామని అన్నారు. మొత్తంగా బాధితులకు 40వేల మెట్రిక్ కూరగాయలు పంపిణీ చేస్తామని అన్నారు. వ్యాపారులు కూడా కూరగాయల ధరలు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర సరుకులు అందేలోపు డ్రైఫుడ్ అందజేస్తామని వెల్లడించారు. బాధితుల ఇళ్లను ప్రభుత్వం తరపున తామే క్లీన్ చేయిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed