ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు.. ఆస్తుల అటాచ్‌కు రంగం సిద్దం

by Javid Pasha |   ( Updated:2023-11-02 04:51:43.0  )
ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దూకుడు.. ఆస్తుల అటాచ్‌కు రంగం సిద్దం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ టెండర్ దక్కించుకున్న టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ దృష్టికి సీఐడీ తీసుకెళ్లింది. హోంశాఖ కూడా ఆస్తులు అటాచ్ చేయడానికి అంగీకరించడంతో కోర్టు అనుమతి కోసం సీఐడీ దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

టెరాసాఫ్ట్‌కు చెందిన గుంటూరులోని ఒక ఇంటి స్థలంతో పాటు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లను అటాచ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరింది. కోర్టు నుంచి అనుమతి లభిస్తే ఆస్తులను సీఐడీ అటాచ్ చేయనుంది. అయితే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed