- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP CBI Court: చంద్రబాబు కరకట్ట ఇల్లు జప్తు పిటిషన్‌పై విచారణ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు కరకట్ట నివాసాన్ని జప్తునకు అనుమతివ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఈ అఫిడవిట్‌పై కోర్టులో విచారణ జరిగింది. అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారి విచారణకు రావాలని ఆదేశించింది. కేసుకు సంబంధించి అన్ని వివరాలు అందించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. అయితే తమ వాదనలు వినాలన్న ప్రతివాదుల పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
కాగా చంద్రబాబు కృష్ణా కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్‌లో ఉంటున్నారు. అయితే ఈ నివాసాన్ని ప్రభుత్వం అటాచ్ చేసింది. చంద్రబాబు సీఎం ఉన్న సమయంలో అప్పటి మంత్రి నారాయణతో కలిసి అధికార దుర్వినయోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ అధికారులు చర్యలు చేపట్టారు. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అవకతవకలకు పాల్పడ్డారని, ఇందుకు బదులుగా లింగమనేని గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు తీసుకున్నారని అభియోగాలు నమోదు చేశారు. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా అల్లంఘించారని విచారణలో తేలడంతో చంద్రబాబు ఇల్లు జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారించి కోర్టు వాయిదా వేసింది. తాజాగా కూడా మరోసారి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.
Also Read...
తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోనుందా..?