- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో జనసేనకు టీడీపీ షాక్ ఇవ్వనుందా..?
దిశ, తిరుపతి: తిరుపతిలో జనసేనకు టీడీపీ షాక్ ఇవ్వనుందా..?. టీడీపీతో పొత్తులో భాగంగా తిరుపతి టికెట్‌ను జనసేన ఆశిస్తోందా?. తిరుపతిలో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారా..?, అందుకే జనసేనకు తిరుపతిని కేటాయించాలనే డిమాండ్ ఆ పార్టీ నేతల నుంచి వస్తోందా..?. టీడీపీతో పొత్తు తప్పనిసరిగా ఉంటుందని జనసేన ఊహించుకుంటోందా..?. అటు టీడీపీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటోందా..? . అందుకే జనసేన నేతల్లో నెలకొందా..?.అంటే అవుననే మాట ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.. తిరుపతి సీటు విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోమంటున్నారు.. ఇంతకు తిరుపతిలో ఏం జరుగుతోంది.?
తిరుపతిపై గంపెడాశలు పెట్టుకున్న జనసేన
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వెలసిన ప్రదేశం తిరుపతి. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వెంకన్న దర్శించుకుంటారు. తమ కోర్కెలు తీర్చమని కోరుకుంటారు. అయితే ఇదంతా భక్తిభావం. కానీ పొలిటికల్‌గా వచ్చే సరికి తిరుపతి సీటుపై జనసేన పార్టీ గంపెడంత ఆశ పెట్టుకుంది. ఎందుకంటే తిరుపతిలో జనసేన అధిసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజికవర్గం ప్రజలు ఎక్కువగా ఉన్నారు. 2009లో ఇక్కడి నుంచి పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందారు. దీంతో ఈసారి తిరుపతి స్థానంలో కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం జనసేన నేతలు పెట్టుకున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరితే తిరుపతి స్థానం తమకే దక్కుందనే భావనలో ఉంది.
టీడీపీ నేత బీద రవిచంద్ర వ్యాఖ్యలు జనసేనలో కలకలం
అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ పరిశీలకుడు బీద రవిచంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన నేతల్లో కొత్త టెన్షన్ తెచ్చిపెట్టాయి. తిరుపతి నియోజకవర్గ టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో బీద రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈసారి ఎలాగైనా తిరుపతిలో టీడీపీ జెండా ఎగరాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే తిరుపతి టీడీపీ నేతలు క్షత్రస్థాయిలో పని చేయకుండా పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకుంటున్నారని, ఈ వైఖరి ఆయనకు నచ్చడం లేదని బీద చెప్పారు.
హ్యాండ్ ఇస్తే అంతు చూస్తామంటున్న జనసేన నేతలు
దీంతో జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. బీద రవిచంద్ర వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి టికెట్‌ను తాము అడుగుతున్నామని తెలిసి కూడా, టీడీపీ జెండా ఎగరేయాలని కోరుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ మద్దతు లేకుండా తిరుపతిలో టీడీపీ గెలిచే సత్తా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. జనసేన తప్పక గెలుస్తుందనే నమ్మకం ఉన్న తిరుపతి లాంటి సీటు కాకుండా, ఓడిపోయే నియోజకవర్గాన్ని ఇస్తే ఏం చేసుకోవాలని జనసేన నేతలు నిలదీస్తున్నారు. తిరుపతి టికెట్ తమకు కాదని టీడీపీ నిలబడితే మాత్రం... అంతు చూస్తామని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.
ఏం జరుగుతుందో..!
ఇలాంటి పరిణామాల చోటు చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదురుతుందా..?. నిజంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి..?. జనసేన కోరినట్లు తిరుపతిని టీడీపీ కేటాయిస్తుందా..?. లేదా టీడీపీనే బరిలో దిగుతుందా..?... మరి గంపెడాశలు పెట్టుకున్న జనసేన పరిస్థితి ఏంటి..?. అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం జనసేన నేతలు చేస్తున్న హెచ్చరికలపై టీడీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Read more:
Pawan Kalyan: వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా? అంటూ అంబటి సెటైర్స్