Gudipally: తహశీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏ ఆత్మహత్య

by srinivas |   ( Updated:2023-07-14 12:48:17.0  )
Gudipally: తహశీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏ ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. గుడిపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గోవిందప్ప ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోవిందప్ప ఓఎల్ కొత్తూరు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. వీఆర్ఏ ఆత్మహత్యపై గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడుపల్లి మండలం ఓఎన్ కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్దకోటమాకులపల్లి గ్రామానికి చెందిన వి.గోవిందప్ప వీఆర్ఏగా పని చేస్తున్నారు. అయితే గోవిందప్ప రాత్రి విధులు నిర్వహించారు. గోవిందప్పతోపాటు మరొక వీఆర్ఏ కూడా నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో గోవిందప్ప తహశీల్దార్ కార్యాలయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆఫీసుకు వచ్చిన కార్యాలయ సిబ్బంది చూసి గోవిందప్పను కిందకు దించారు. అప్పటికే గోవిందప్ప మృతి చెందాడు. దీంతో పోలీసులకు తహశీల్దార్ సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గోవిందప్ప ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story