Srikalahasti: రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం

by srinivas |
Srikalahasti: రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం
X

దిశ, శ్రీకాళహస్తి: మేర్లపాక- శ్రీకాళహస్తి మార్గంలోని మేర్లపాక -కొత్త కండిగ మధ్య తిరుపతి వైపు వచ్చే ట్రాక్ పై గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు చేతిపై అమ్మ అనే పచ్చబొట్టు ఉంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులపాటు మృతదేహం మార్చరీలోనే ఉంటుందని, చుట్టుప్రక్కల పరిసర ప్రాంతానికి చెందిన వాడై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తుపట్టగలిగితే మృతుని బంధువులకు సమాచారం తెలియజేయాలని రేణిగుంట రైల్వే ఎస్సై అనిల్ కుమార్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed