- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > చిత్తూరు > Tirupati: మే 24న కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati: మే 24న కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
by srinivas |
X
దిశ,డైనమిక్ బ్యూరో: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 24న ఉదయం 6-30గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారని తెలిపింది.
Advertisement
Next Story