- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన అంబటి కాదు.. ఆంబోతు రాంబాబు: జనసేన నేత కిరణ్ ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సోమవారం తిరుమల(Tirumala) పర్యటనలో వైఎస్ జగన్(YS Jagan) స్టిక్కర్ ఉన్న చొక్కాతో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్(Tirupati Janasena leader Kiran Royal) స్ట్రాంగ్‌గా స్పందించారు. ఆయన అంబటి రాంబాబు కాదని, ఆంబోతు రాంబాబు అని విమర్శించారు. చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అంబటి రాంబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబుకు ఇంగిత జ్ఞానం లేదని, ఉంటే జగన్ స్టిక్కర్ ఉన్న చొక్కా వేసుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారని విమర్శించారు. అంబటి రాంబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు(TTD Vigilance Officers) ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక గంట సేపు చొక్కా విప్పి దర్శనం చేసుకుంటే ఏం అవుతుందని నిలదీశారు. ఆ స్టిక్కర్‌తో అంబటి రాంబాబు తిరుమలకు రావడం కాదని, జగన్ ఇంటి చుట్టూ తిరగాలని కిరణ్ రాయల్ సలహా ఇచ్చారు.