దారుణం.. కన్నకొడుకుపై తండ్రి కత్తితో దాడి

by srinivas |
దారుణం.. కన్నకొడుకుపై తండ్రి కత్తితో దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం మావిళ్ళపాడు గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కన్న కొడుకుపై తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. వాటంబేడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో 10 ఏళ్ల కన్న కొడుకుపై కత్తితో దాడికి దిగారు. అడ్డుకున్న బంధువులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. గాయపడిన వారిని 108 ద్వారా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దొరవారిసత్రం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story