- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala News:తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ..కారణం ఇదే!
దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో గత కొద్దీ రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ క్రమంలో (సోమవారం) ఈ రోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకు వస్తున్నారు.
అందుకే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. 300రూ. ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి ఈ రోజు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఫ్రీ దర్శనం క్యూ లైన్‌లో ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.