Tirupati: డైకీన్ పరిశ్రమలో చోరీ... 9 మంది అరెస్ట్

by srinivas |
Tirupati: డైకీన్ పరిశ్రమలో చోరీ...  9 మంది అరెస్ట్
X

దిశ, శ్రీసిటీ: తిరుపతి జిల్లా శ్రీసిటీ పారిశ్రామిక వాడలో దొంగతనం జరిగింది. డైకీన్ ఏసీ తయారీ పరిశ్రమలో విలువైన కాపర్ మెటీరియల్‌ను ఎత్తుకెళ్లారు. పరిశ్రమ యాజమాన్యం శ్రీసిటీ హైటెక్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 9 మంది నిందితులను గుర్తించారు. డైకీన్ ఏసీ తయారీ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న నలుగురు, మరో ఐదుగురు కాపర్ వైర్ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. వారి నుంచి 200 మీటర్ల కాపర్ మెటీరియల్, రూ.1.80 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు పాత ముద్దాయిలు ఉన్నారని, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story