- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ. 50 లక్షలు టోకరా
దిశ, చంద్రగిరి: సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి తప్పుడు ఆఫర్ లెటర్లు ఇచ్చి వారిని మోసం చేసిన ఇద్దరు కేటుగాళ్లపై బాధితులు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా, చంద్రగిరికి చెందిన పాశం గురుప్రసాద్, బండకింద రెడ్డప్ప సుమారు 50 లక్షల రూపాయాలు కాజేశారు. హైదరాబాద్, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల కు చెందిన నిరుద్యోగులకు మోసం చేశారు. దీంతో బాధితుల తల్లితండ్రులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
ప్రముఖ కంపెనీల్లో హెచ్.ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నానని పాశం గురుప్రసాద్ నిరుద్యోగులతో పరిచయం చేసుకుని నమ్మించేవాడని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు. విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఎమ్ టీసీఎల్ కంపెనీల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ పంపిచేవాడని పేర్కొన్నారు. ఫేక్ ఆఫర్ లెటర్స్ పట్టుకుని కంపెనీలకు వెళితే మోసపోయినట్లు తెలిసిందన్నారు. మోసగాడు పాశం గురుప్రసాద్, అతని అనుచరుడు బండకింద రెడ్డప్పల స్వగ్రామం చంద్రగిరి అని తెలుసుకుని ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చామని చెప్పారు. వీరిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా గతంలో చీటింగ్ కేసు నమోదై ఉందన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను వేడుకొంటున్నారు