Breaking: చంద్రబాబు పుంగనూరు టూర్‌లో హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత

by srinivas |
Breaking: చంద్రబాబు పుంగనూరు టూర్‌లో హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా పుంగనూరులో హెటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పుంగనూరు అంగళ్లు సెంటర్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు సర్ది చెప్పినా రెండు వర్గాలు వినలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఉద్రిక్తత మధ్య చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed