- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీపీ గెలిచి 30 ఏళ్లు అయింది.. ఈసారైనా గెలిపించరా: Nara Lokesh
దిశ, తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 29వ రోజు చంద్రగిరి నియోజక వర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా తొండవాడలో బహిరంగ సభ నిర్వహించారు. లోకేశ్ ప్రసంగిస్తూ చంద్రబాబులాంటి నాయకుడు వచ్చిన ప్రాంతమిది అని గొప్పలు చెప్పారు. ఈ నియోజకవర్గంలోని నారావారిపల్లె చంద్రబాబు స్వస్థలమని గుర్తు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవక 30 ఏళ్లవుతోందన్నారు. చివరి సారిగా 1994లో గెలిచిందని చెప్పారు. ఈ దఫా అయినా టీడీపీని గెలిపించాలని కోరారు. చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేస్తారని, భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను నారా లోకేశ్ అభ్యర్థించారు.
1994లో చంద్రబాబు నాయుడు తమ్ముడు గెలుపు
కాగా 1994లో టీడీపీ తరపున చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారిపై గెలుపొందారు. ఆ తర్వాత ఎప్పుడూ టీడీపీని చంద్రబాబు సొంత నియోజకవర్గ ప్రజలు ఆదరించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారి ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలు. వైసీపీ ఆవిర్భావం తర్వాత...చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ పార్టీ తరపున పట్టు సాధించారు. రాష్ట్రంలోని పేరున్న గల్లా అరుణకుమారిపై చెవిరెడ్డి గెలవడం ఓ సంచలనమైంది.