లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలు విధించలేదు: Tirupati Sp

by srinivas |
లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలు విధించలేదు: Tirupati Sp
X

దిశ, వెబ్ డెస్క్: నారా లోకేశ్​ పాదయాత్రకు ఎక్కడా ఆంక్షలు విధించలేదని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే మాఢవీధుల్లో పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశామని ఆయన తెలిపారు. లోకేశ్​ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడా మోహరించలేదన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జిల్లా వ్యాప్తంగా 1200 మందిని బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. లోకేశ్​ పాదయాత్రకు 350 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పరమేశ్వరరెడ్డి తెలిపారు.

కాగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సాగింది. అయితే శ్రీకాళహస్తి ఆలయం సమీపంలో లోకేశ్ యాత్రకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల వైఖరిపై విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇచ్చారు.

Next Story

Most Viewed