Tirupati: చంద్రగిరి మండలంలో భారీగా ఎర్రచందనం సీజ్

by srinivas |   ( Updated:2023-06-06 14:13:20.0  )
Tirupati: చంద్రగిరి మండలంలో భారీగా ఎర్రచందనం సీజ్
X

దిశ, చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రూ. కోటీ విలువైన ఎర్రచందనం దుంగలను, పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. లారీని తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలను పొడర్‌గా చేసి తరలించేందుకు యత్నించారు. దీంతో ఐదుగురు స్మగర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద పొడి బ్యాగులు, రెండు కార్లు, లారీని స్వాధీనం చేసుకున్నారు. 25 కేసుల్లో నిందితుడిగా ఉన్న మహ్మద్ రసూల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story