- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamballapalli: నారా లోకేశ్‌కు నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కోడ్ నేపథ్యంలో నారా లోకేశ్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పాదయాత్ర నిలిపివేయాలని, జిల్లా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు. లోకేశ్‌తో పాటు స్థానికులుకాని సిబ్బంది కూడా వెళ్ళాలిపోవాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్లు కాని వ్యక్తులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల నోటీసుతో ఇవాళ రాత్రి బస చేయాల్సిన ప్రాంతంపై కూడా ఉత్కంఠ నెలకొంది. లోకేశ్ శనివారం రాత్రి కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద బస చేయాల్సి ఉంది. అయితే నోటీసుల నేపథ్యంలో అక్కడ బస చేస్తారా లేక వెనుదిరుగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.
టీడీపీ నేతల ఆగ్రహం
మరోవైపు ఈనెల 11,12,13 తేదీల్లో జిల్లాలో ఉండేందుకు పోలీసులు అనుమతులు ఇచ్చారని టీడీపీ నేతలు చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి నారా లోకేశ్‌ను జిల్లా వదిలి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో లోకేశ్ జిల్లాలో ఉండటానికి లేదని అటు రెవెన్యూ అధికారులు కూడా నోటీసులు అందజేశారని టీడీపీ నాయకులు చెప్పారు. లోకేశ్ సవాల్‌కి భయపడే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే 12,13 పాదయాత్రకి బ్రేక్ ఇచ్చామని చెప్తున్నా అధికారులు వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు.