Ap News: 5,376 టన్నుల ఎర్రచందనం విక్రయానికి అనుమతి

by srinivas |
Ap News: 5,376 టన్నుల ఎర్రచందనం విక్రయానికి అనుమతి
X

దిశ, తిరుపతి: కేంద్రం నుంచి 5,376 టన్నుల ఎర్రచందనం అమ్మేందుకు అనుమతులు వచ్చినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో ఎర్రచందనం ఎగమతిదారుల ప్రోత్సాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనం బహిరంగ వేలంలో పాల్గొనే బిడ్డర్లకు ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వచ్చిన బిడ్డర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, పీసీసీఎఫ్‌ మధుసూదన రెడ్డి, సీసీఎఫ్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed