- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yuvagalam 400 K.M: నారా లోకేశ్ కీలక హామీ.. గుర్తుగా శిలాఫలకం
దిశ, డైనమిక్ బ్యూరో: యువగళం పాదయాత్రలో ఒక్కో మైలురాయిని ప్రగతికి పునాదిరాయిగా నిలిచేలా నారా లోకేశ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువగళం 400 కి.మీ చేరుకున్న సందర్భంగా పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్రకుంటలో పీహెచ్‌సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటైతే, నరేంద్రకుంట పరిసర ప్రాంత ప్రజల వైద్యం కోసం పడే వ్యయప్రయాసలు తగ్గుతాయని లోకేశ్ అన్నారు.
ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర
కాగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నా నారాలోకేశ్ తగ్గేదేలే అంటున్నారు. ప్రతి వంద కిలో మీటర్ల వద్ద ఏదో ఒక హామీ ఇస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. తాజాగా 400 కిలో మీటర్లు పూర్తి కావడంతో కీలక హామీ ఇచ్చారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. నారా లోకేశ్ పాదయాత్రతో అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయని, ఈ సారి ఎన్నికల్లో తమదే గెలపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.