- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు సందర్శించుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి వెంట మాజీ టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేద ఆశీర్వచన మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం పలికిన అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, కోర్టు ప్రోటోకాల్ అధికారి ధనుంజయ నాయుడు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి: Tirumala: అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ