- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్తూరు జిల్లాలో మామిడికాయల లారీ బోల్తా.. జనాలు ఏం చేశారంటే..!
దిశ, వెబ్ డెస్క్: మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపరం మండలం ఏడో మైలు వద్ద జరిగింది. సుమారు లక్ష రూపాయల విలువైన మామిడి కాయలతో లారీ రోడ్డుపై వెళ్తుండగా అదుపు తప్పింది. డ్రైవర్ కంట్రోల్ చేసేలోపే రోడ్డుపై అడ్డంగా బోల్తాకొట్టింది. దీంతో మామిడికాయలు రోడ్డు పాలయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారు.
ఈ ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల సాయంతో జేసీబీతో లారీని పక్కకు తీశారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లారీ నుంచి రోడ్డుపాలైన మామిడికాయలను స్థానికులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. లక్ష రూపాయల మామిడికాయలు రోడ్డు పాలు కావడంతో వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.