- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్‌ఐగా మహిళ కానిస్టేబుల్ సెలెక్ట్
దిశ, తిరుపతి: ఆమె కానిస్టేబుల్. పట్టుదల, ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశ ఆమెను ఎస్ఐ స్థాయికి తీసుకెళ్లింది. ఆమె ఎవరో కాదు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పూర్ణ చంద్రిక. 2023 జరిగిన ఎస్సై పరీక్షలలో 218 మార్కులతో ఓపెన్ కేటగిరిలో ఎన్నిక అయ్యారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎం. పూర్ణ చంద్రిక. 2014 బ్యాచ్‌కి చెందిన పోలీస్. చిన్న గొట్టిగల్లు మండలం దండారు వాండ్లపల్లికు చెందిన ధనలక్ష్మి చిరంజీవి తల్లిదండ్రులకు జన్మించిన మొదటి కుమార్తె పూర్ణ. 3 ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మృతి చెందడంతో పెదనాన్న ప్రసాద్ ,పెద్దమ్మ సుబ్బమ్మ చేరదీసి ఉన్నత చదువులు చదివించారు. ఇంటర్ విద్యాభ్యాసం పూర్తికాగానే భర్త రమేష్‌తో వివాహం జరిగింది. పూర్ణచంద్రిక, రమేష్‌కు ఇరువురు సంతానం. కొడుకు హర్షవర్ధన్ 9వ తరగతి, కూతురు ఇందుప్రియ ఆరవ తరగతి చదువుతోంది. భర్త రమేశ్ అత్త సరోజమ్మ ప్రోత్సాహంతో చదువు కొనసాగిస్తూ జీవితం గడుపుతున్నారు. మహిళ పోలీసుగా విధులు నిర్వహిస్తూ సెలవుపై సంవత్సరం పాటు కాకినాడలోని శ్యామ్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఏపీలో జరిగిన 411 ఎస్సై పోస్టులకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ నుంచి 343 మంది అర్హత సాధించడం గమనార్హం.