- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumalaలో అనూహ్యంగా పెరిగిన రద్దీ
దిశ, తిరుపతి: తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఆదివారం కావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట టీబీసీ వరకూ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూలైన్‌లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే వారికి స్వామి వారి దర్శనం ముప్పయి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇక
హుండీ ఆదాయం...మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,262 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.