- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పద్ధతి మార్చుకో చెవిరెడ్డి.. లేకపోతే భంగపాటు తప్పదు: పులివర్తి నాని
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో చంద్రగిరి పంచాయితీ కొనసాగుతోంది. ఎమ్మెల్యే పులివర్తి నాని వర్సెస్ చెవరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీగా రాజకీయం మారింది. గత ఐదేళ్లులో చంద్రగిరి నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడిచింది. దీంతో ప్రతిపక్షాలను నోరెత్తివ్వలేదు. చెవిరెడ్డి, ఆయన కుటుంబం చెప్పిందే శాసనంగా చంద్రగిరిలో నడిచింది. ఇటీవల జరిగిన ఎన్నికలు చెవిరెడ్డి కుటుంబం తల రాతను మార్చేసింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఒంగోలులో ఎంపీగా మాగంటి శ్రీనివాసులు రెడ్డి గెలుపొందగా.. చంద్రగిరిలో పులివర్తి నాని విజయం సాధించారు. చాలా కాలం ఎమ్మెల్యేగా గెలవన్న నాని కోరిక 2024 సార్వత్రిక ఎన్నికలతో తీరింది.
అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పులివర్తి నానిపై చెవిరెడ్డి వర్గం దాడి చేసింది. తిరుపతి ఎస్వీయూలో ఉన్న ఈవీఎంలను పరిశీలించేందుకు వెళ్తున్న నానిపై మోహత్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు దాడి చేసేందుకు యత్నించారు. నాని కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. అయితే ఈ దాడిలో పులివర్తి నాని గాయపడ్డారు. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా చంద్రగిరి ప్రజల సేవలు చేస్తున్నారు.
అయితే రెండు రోజలు క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి అరెస్ట్‌తో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నారు. పులివర్తి నానిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించి 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిపై పులివర్తి నాని కక్ష కట్టి అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. విదేశాల్లో చదివిన తన కుమారుడిని వీధి పోరాటాలకు సిద్ధం చేశారని మండిపడ్డారు. ప్రజా పోరాటాలు ఎలా ఉంటయో ప్రభుత్వానికి, పోలీసులకు చూపిస్తామని హెచ్చరించారు. పులి వర్తి నాని అసలు దెబ్బలే తగలలేదని, ఎన్నికల సమయంలో కావాలనే ఆయన డ్రామాలాడారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేశారు.
ఇక చెవిరెడ్డి వ్యాఖ్యలపై పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. తన దాడి చేసిన వారే ప్రధాన నిందితుడిగా మోహిత్ రెడ్డి అని చెప్పారన్నారు. అందుకే తనపై హత్యాయత్నం కేసులో 32 వ నిందితుడిగా మోహిత్ రెడ్డి పేరును చేర్చారని తెలిపారు. మోహిత్ రెడ్డి విదేశాల్లో చదివారని వదిలివేయమంటారా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టాలంటే రెండు నెలలు ఆగాల్సిన పని లేదన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని, అందుకే సమయమంతా సరిపోతుందని, కక్ష పూరిత రాజకీయాలు చేయాలంటే ఇప్పటిదాకా ఆగేవాళ్లమా అని నిలదీశారు. తప్పుడు సమాచారం, సంకేతం ఇవ్వడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మానుకోవాలన్నారు. చెవిరెడ్డి చేసిన అక్రమాలు బయటకు తీస్తే దేశద్రోహం కేసులు పెట్టాల్సి ఉంటుందని పులివర్తి నాని పేర్కొన్నారు.